Gold And Silver Rate: బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. ఒక్కరోజే రూ.19,750 తగ్గిన పసిడి
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు దొరకక పెరుగుతున్న బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (జనవరి 31) అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.19,750తో పడిపోవడంతో పెట్టుబడిదారులు షాక్ అయ్యారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,653గా ఉంది. ఈ ఒక్కరోజే దాదాపు 10 శాతం వరకు బంగారం ధరలో తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు.
Details
వెండి ధరలు కూడా పతనం
ఇటీవలి రోజులుగా బంగారం ధరలు ఎగబాకిన నేపథ్యంలో ఈ స్థాయి పతనం మార్కెట్‌లో కలకలం రేపింది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే కిలో వెండి ధర రూ.1,07,971తో పతనమైంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,91,922గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు సుమారు 34 శాతం మేర తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ వడ్డీ రేట్లపై అంచనాలు మారడం, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలు ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరింత ఒడిదుడుకులు కొనసాగే అవకాశముంది.