LOADING...
Gold And Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే!
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే!

Gold And Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల నుంచి దిగిరావడం లేదు. కొన్ని రోజులుగా ఇవి ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు 25 ఉదయం నాటికి గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,01,610కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,140 వద్ద కొనసాగింది. వెండి ధరలు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900గా నమోదైంది.

Details

నగరాల వారీగా బంగారం ధరలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో స్థానిక డిమాండ్‌, సరఫరా, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ధరలు మారుతున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140, 24 క్యారెట్ల ధర రూ.1,01,610. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.93,140, 24 క్యారెట్ల ధర రూ.1,01,610. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.93,140, 24 క్యారెట్ల బంగారం రూ.1,01,610. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.93,140, 24 క్యారెట్ల ధర రూ.1,01,610. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.93,140, 24 క్యారెట్ల బంగారం రూ.1,01,610గా నమోదైంది.

Details

నగరాల వారీగా వెండి ధరలు 

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ.1,29,900. బెంగళూరులో కేజీ వెండి రూ.1,19,900. చెన్నైలో కిలో వెండి రూ.1,29,900. ఢిల్లీ, ముంబయిలో కేజీ వెండి ధర రూ.1,19,900 స్థాయిలో ఉంది. అయితే, స్థానిక మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ ధరల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు.

Details

ధరల మార్పుకు కారణాలు 

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌, డాలర్‌ విలువ, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి మారుతుంటాయి. ఇటీవల బంగారం ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఉదాహరణకు, ఆగస్టు 20న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,150 కాగా, 22 క్యారెట్ల ధర రూ.91,800గా నమోదైంది. అంటే ఐదు రోజుల్లోనే దాదాపు రూ.1,460 పెరిగినట్టు స్పష్టమవుతోంది.