Gold Prices: పండుగ వేళ బంగారం,వెండి ధరల్లో భారీ పెరుగుదల.. ఇవాల్టీ రేట్లు ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయంగా బంగారం,వెండి ధరలు గణనీయంగా పెరుగడంతో, దేశీయంగా కూడా ఈ లోహాల ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 2026 ప్రారంభం నుండి గోల్డ్, సిల్వర్ రేట్లు నిరంతరం పెరుగుతున్నాయి. ధరల తగ్గుదల లేకపోవడం కారణంగా, వినియోగదారులు షాక్‌లో పడుతున్నారు. ప్రత్యేకంగా బంగారం రేట్లతో పాటు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం గోల్డ్ ధరలు రూ.1.40 లక్షల మార్క్‌ను తాకాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
వివరాలు
బంగారం ధరలు:
హైదరాబాద్: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,160 వద్ద కొనసాగుతోంది.నిన్న ఇదే ధర రూ.1,42,150గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,310 వద్ద ట్రేడవుతోంది; సోమవారం ఇది రూ.1,30,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,160 వద్ద స్థిరపడగా,22 క్యారెట్ల ధర రూ.1,30,310 వద్ద కొనసాగుతోంది. చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,140 వద్ద కొనసాగుతూ,22 క్యారెట్ల ధర రూ.1,31,210 వద్ద ఉంది. బెంగళూరు: 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ.1,42,160 వద్ద ట్రేడవుతోంది; 22 క్యారెట్లు రూ.1,30,310 వద్ద ఉన్నాయి. దిల్లీ: 24 క్యారెట్ల ధర రూ.1,42,310 వద్ద, 22 క్యారెట్లు రూ.1,30,460 వద్ద కొనసాగుతున్నాయి.
వివరాలు
వెండి ధరలు:
దిల్లీ: కేజీ వెండి ధర రూ.2,70,100 వద్ద కొనసాగుతోంది; సోమవారం ఇది రూ.2,70,000గా ఉంది. హైదరాబాద్: కేజీ వెండి ధర రూ.2,87,100 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధర ఉంది. చెన్నై: కేజీ వెండి ధర రూ.2,87,100 వద్ద ఉంది. బెంగళూరు: కేజీ వెండి ధర రూ.2,70,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది; సోమవారం ఇది రూ.2,70,000గా ఉంది.