
Gold Rate: పసిడి ప్రియులకు రిలీఫ్.. యథాతథంగా బంగారం ధరలు.. వెండి ధరలో కూడా ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
గోల్డ్ లవర్స్ కు ఉపశమనం లభించింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోయారు బంగారం కొనాలన్నా కూడా వారు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా బంగారం ధరలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. గురువారం ఈ ధరల్లో ఎలాంటి పెద్ద మార్పులు నమోదు కాలేదు. నిన్నటి స్థాయిలోనే బంగారం ట్రేడ్ అవుతోంది. అయితే వెండి ధరలో మాత్రం కొంత ఉపశమనం కనిపించింది.
వివరాలు
కిలో వెండి ధర రూ.1,29,900
ఈ రోజు కిలో వెండిపై రూ.100 తగ్గిపోయి, ప్రస్తుతం రూ.1,29,900 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,10,509గా విక్రయిస్తున్నారు. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.82,880 వద్ద అమ్మకానికి లభిస్తోంది. చెన్నై మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,40,000 వద్ద అమ్ముడవుతోంది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,29,900 వద్ద లావాదేవీలు కొనసాగుతున్నాయి.