LOADING...
Gold & Silver Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. కళ్లు తేలేస్తున్న వినియోగదారులు
మరోసారి భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. కళ్లు తేలేస్తున్న వినియోగదారులు

Gold & Silver Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. కళ్లు తేలేస్తున్న వినియోగదారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు మరోసారి మండిపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పసిడి ధర రూ.1.30 లక్షల స్థాయిని దాటగా, వెండి కిలో ధర రూ.1.96 లక్షల పైకి చేరింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో సోమవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గతంతో పోల్చితే రూ.660 పెరిగి రూ.1,30,480గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,19,570కు విక్రయమవుతోందని బులియన్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.4,000 పెరిగి కిలో రూ.1,96,000గా నిలిచింది.

వివరాలు 

 వెండి రికార్డు స్థాయిలో 57.76 డాలర్లకు.. 

ఇదిలా ఉండగా, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిగే పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం, వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి భారీగా పెరిగింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 4,218 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి రికార్డు స్థాయిలో 57.76 డాలర్లకు చేరుకుని కొనసాగుతోంది. ఈ అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా ప్రస్తుతం బంగారం,వెండి ధరలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ, వచ్చే 2026 నాటికి వీటిలో భారీ పతనం వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement