Page Loader
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..
Gold : మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లక్ష రూపాయల మార్క్‌ను దాటిన బంగారం ధర, ప్రస్తుతం రూ. 98 వేలకు దిగువన చేరుకుంది. ఈ నేపథ్యంలో జూలై 8 ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,280గా నమోదైంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,090గా ఉంది. మన భారతీయ సంప్రదాయాల్లో బంగారం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పండుగలు,శుభకార్యాల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం పరంపరగా కొనసాగుతోంది.

వివరాలు 

ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం: 

ముఖ్యంగా ఆ సమయాల్లో బంగారం షాపులు మహిళల రద్దీతో నిండిపోతాయి. అయితే నిన్నటితో పోల్చితే బంగారం ధరలో తులంకు సుమారు రూ.400 మేర తగ్గుదల కనిపిస్తోంది. వెండి విషయానికి వస్తే, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది. చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,280; 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,090 ముంబై: 24 క్యారెట్ల ధర రూ.98,280; 22 క్యారెట్ల ధర రూ.90,090 ఢిల్లీ: 24 క్యారెట్ల ధర రూ.98,430; 22 క్యారెట్ల ధర రూ.90,240 హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ.98,280; 22 క్యారెట్ల ధర రూ.90,090

వివరాలు 

ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం: 

విజయవాడ: 24 క్యారెట్ల ధర రూ.98,280; 22 క్యారెట్ల ధర రూ.90,090 బెంగళూరు: 24 క్యారెట్ల ధర రూ.98,280; 22 క్యారెట్ల ధర రూ.90,090 కోల్‌కతా: 24 క్యారెట్ల ధర రూ.98,280; 22 క్యారెట్ల ధర రూ.90,090 గమనిక: బంగారం,వెండి ధరలు సమయానుసారంగా మారుతూ ఉంటాయి. కనుక కొనుగోలు చేయబోయే సమయంలో తాజా ధరలను చెక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ధరలు రోజువారీగా పెరిగే అవకాశముంది, అలాగే తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంది.