Page Loader
Gold Price Today: అతి స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే.. 
అతి స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

Gold Price Today: అతి స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశపు సాంప్రదాయంలో చిన్నపాటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక రీతిగా కొనసాగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లసీజన్‌ వచ్చినప్పుడు బంగారం షాపులన్నీ కస్టమర్లతో నిండిపోతాయి. భారతీయ మహిళలకు బంగారం అంటే విశేషమైన అభిమానం ఉంటుంది. ధరలు పెరిగినా,తగ్గినా బంగారంపై వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. తాజాగా జూన్ 9న దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈరోజు తులం బంగారంపై కేవలం రూ.10తగ్గింది. ఇటీవల బంగారం ధర రూ.1లక్షకు పైగా చేరిన తర్వాత కొంతవరకు తగ్గుదల నమోదు అయింది. అయితే ఇప్పుడు మళ్లీ లక్ష రూపాయలు దాటేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.97,960గా ఉండగా,22 క్యారెట్ల బంగారం ధరరూ.89,790 వద్ద ఉంది.

వివరాలు 

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు

ఇప్పుడు దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం: చెన్నై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.97,960, 22 క్యారెట్ల ధర రూ.89,790 ముంబై: 24 క్యారెట్ల ధర రూ.97,960, 22 క్యారెట్ల ధర రూ.89,790 ఢిల్లీ: 24 క్యారెట్ల ధర రూ.98,110, 22 క్యారెట్ల ధర రూ.89,940 హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ.97,960, 22 క్యారెట్ల ధర రూ.89,790 విజయవాడ: 24 క్యారెట్ల ధర రూ.97,960, 22 క్యారెట్ల ధర రూ.89,790 ఇక వెండి విషయానికొస్తే,కిలో వెండి ధరలో సైతం స్వల్పంగా రూ.100 తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,00,900 వద్ద కొనసాగుతోంది.