
Gold And Silver Rate: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయంగా బంగారం పట్ల ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండటం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు కొన్ని సందర్భాల్లో పెరుగుతుండగా.. మరికొన్ని సందర్భాల్లో తగ్గుతూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో బంగారం,వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ స్థాయి నుంచి కొంత మేర తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా పరిస్థితుల్లో బంగారం ధర మరింత పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది.
వివరాలు
వెండి ధర కిలో రూ.1,13,900
2025 జులై 18వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పలు ప్రముఖ వెబ్‌సైట్లలో నమోదైన ధరల వివరాలను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.99,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.91,060గా నమోదైంది. బంగారం ధర పది గ్రాములకు రూ.10 మేర పెరిగినట్లు సమాచారం. మరోవైపు వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.1,13,900కి చేరుకుంది. అయితే, దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వివరాలు
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్‌లో: 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.99,340గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,060గా ఉంది. కిలో వెండి ధర రూ.1,23,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నాల్లో: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,340గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,060గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1,23,900గా ఉంది. దిల్లీలో: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,490గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.91,140గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1,13,900గా ఉంది. ముంబయిలో: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,340గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,060గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,13,900గా నమోదైంది.
వివరాలు
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
చెన్నైలో: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,340గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.91,060గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,23,900గా ఉంది. బెంగళూరులో: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,340గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,060గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,13,900గా ఉంది. గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తాజా ధరల అప్‌డేట్స్ తెలుసుకోవాలనుకుంటే.. 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తాజా వివరాలను తెలుసుకోవచ్చని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.