LOADING...
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల భారీగా ఊగిసలాడిన బంగారం,వెండి ధరలు ప్రస్తుతం కొంత కూల్ అయ్యాయి. వెనిజులాలో నెలకొన్న సంక్షోభ ప్రభావంతో ఈ వారం ప్రారంభం నుంచి ఈ లోహాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో బంగారం,వెండి కొనాలంటేనే వినియోగదారులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా పరిస్థితి మారింది. ఈరోజు బంగారం,వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. తులం బంగారంపై రూ.270 తగ్గగా, కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. తులం బంగారంపై రూ.270 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,38,000 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

వెండి ధరలు 

అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 తగ్గి రూ.1,26,500 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.210 తగ్గి రూ.1,03,500 స్థాయిలో కొనసాగుతోంది. వెండి ధరల విషయంలో కూడా ఊరట లభించింది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర సుమారు రూ.2,52,000 వద్ద విక్రయమవుతోంది. అయితే హైదరాబాద్‌, చెన్నై మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.2,72,000 దగ్గర ట్రేడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,52,000 స్థాయిలోనే కొనసాగుతోంది.

Advertisement