
Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే…
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో బంగారానికి ఎప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల సమయంలో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది.
అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. పసిడి ధరలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి చేరడంతో,మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే భయానికి లోనవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
మెల్లిగా ధరలు పడిపోయే దిశగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో మే 28వ తేదీ నాటికి భారతదేశంలోని ప్రధాన నగరాలు,పట్టణాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు
భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండవ రోజు తగ్గాయి.
ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాము రూ.9,747గా ఉండగా,22 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8,934గా ఉంది. అలాగే,18 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.7,310గా నమోదైంది.
దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,650
ముంబై: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500
చెన్నై: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500
బెంగళూరు: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500
వివరాలు
వెండి ధరలు :
హైదరాబాద్: 22 క్యారెట్ల ధర రూ.87,540, 24 క్యారెట్ల ధర రూ.95,500
విశాఖపట్నం, విజయవాడ: 22 క్యారెట్ల ధర రూ.89,340, 24 క్యారెట్ల ధర రూ.97,470
ఒక్క గ్రాము వెండి ధర: రూ.110.90
ఒక కిలో వెండి ధర: రూ.1,10,900
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ధరలు మే 28వ తేదీ ఉదయం 6 గంటలకు నమోదైనవే. మీరు ఎప్పటికప్పుడు బంగారం లేదా వెండి ధరల తాజా సమాచారం తెలుసుకోవాలంటే, 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.