పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
ఈ వార్తాకథనం ఏంటి
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతోంది. నిన్న ఉన్న ధరలు నేడు ఉండట్లేదు. ధరలు రోజుకో తీరులో ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కిందటి సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం రేట్లు శనివారం కాస్త పెరిగాయి.
బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశీయంగా వెండి ధరలు వినియోగదారులకు ఝలక్ ఇచ్చాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన మేలిమి బంగారం రూ.61 వేలకు దూసుకెళ్తోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.56 వేలపైకి పరుగులు తీస్తోంది.
హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ ఒక్కరోజే రూ.400కు ఎగబాకడం విశేషం.
DETAILS
హైదరాబాద్ లో బంగారం ధర, దిల్లీలో వెండి ధర తక్కువ
ప్రస్తుతం 10 గ్రాములకు రూ.55 వేల 600గా కొనసాగుతోంది. 10 గ్రాములకు 24 క్యారెట్ల ధర రూ.60 వేల 680కు దూసుకెళ్లింది. ఈ లెక్కన దాదాపుగా రూ.460 పెరిగింది. హైదరాబాద్ తో పోల్చేతే దిల్లీలోనే పసిడి ధరలు కాస్త అధికంగా ఉన్నాయి.
మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.55 వేల 750గా నమోదైంది. ఇక 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ రేట్ రూ.460 పెరిగి రూ.60 వేల 830కు చేరింది.
హైదరాబాద్ లో వెండి ఒక్కసారిగా కిలోకి రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.79 వేల 700 పలకడం గమనార్హం.
ఇక దిల్లీలో వెండి రేటు నెమ్మదిస్తూ రూ.1100 పెరిగి రూ.74 వేల 500 వద్ద కొనసాగుతోంది.