LOADING...
Gold Rate: భౌగోళిక అనిశ్చితి ప్రభావం.. స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rate: భౌగోళిక అనిశ్చితి ప్రభావం.. స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో నెలకొన్న రాజకీయ ఉద్విగ్నతలు, భవిష్యత్తుపై అనిశ్చితి నేపథ్యంలో పసిడి వంటి సురక్షిత పెట్టుబడులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిణామాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీసాయి. తాజాగా ఆగస్టు 4వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01,340కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,890గా ఉంది. గతంతో పోలిస్తే ఇవి స్వల్పంగా తగ్గినప్పటికీ, ధరలు ఇంకా అత్యంత ఉన్నతస్థాయిలోనే ఉన్నాయి.

వివరాలు 

 సుమారు రూ. 100 మేర తగ్గిన వెండి

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,490గా ఉండగా, అదే పరిమాణంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 93,040గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడా 24 క్యారెట్ల ధర రూ. 1,01,340 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 92,890గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే, నిన్నటి ధరలతో పోలిస్తే దాని రేటు సుమారు రూ. 100 మేర తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్‌లో రూ. 1, 01, 340, రూ. 92, 890 విజయవాడలో రూ. 1, 01, 340, రూ. 92, 890 ఢిల్లీలో రూ. 1, 01, 490, రూ. 93, 040 ముంబైలో రూ. 1, 01, 340, రూ. 92, 890 వడోదరలో రూ. 1, 01, 390, రూ. 92, 940 కోల్‌కతాలో రూ. 1, 01, 340, రూ. 92, 890 చెన్నైలో రూ. 1, 01, 340, రూ. 92, 890 బెంగళూరులో రూ. 1, 01, 340, రూ. 92, 890 కేరళలో రూ. 1, 01, 340, రూ. 92, 890 పుణెలో రూ. 1, 01, 340, రూ. 92, 890

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 22, 900 విజయవాడలో రూ. 1, 22, 900 ఢిల్లీలో రూ. 1, 12, 900 చెన్నైలో రూ. 1, 22, 900 కోల్‌కతాలో రూ. 1, 12, 900 కేరళలో రూ. 1, 22, 900 ముంబైలో రూ. 1, 12, 900 బెంగళూరులో రూ. 1, 12, 900 వడోదరలో రూ. 1, 12, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 12, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.