LOADING...
Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే? 
మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గుముఖం పట్టిన బంగారం.. ఈ రోజు ధర ఎంతంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశంలో బంగారానికి ఉన్నఆకర్షణ మరే ఇతర లోహానికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది తమ పొదుపు మొత్తాన్ని పసిడిపై పెట్టుబడి రూపంలో వెచ్చించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈలోహం మీద మోజు ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. చాలామంది ఒంటి నిండా బంగారం ధరిస్తే ఎంత అందంగా ఉంటుందో అన్న కలలతో బతుకుతుంటారు. మరోవైపు,మార్కెట్ పరిస్థితులు,వినియోగదారుల డిమాండ్ ఆధారంగా బంగారంధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇటీవల పసిడి ధరల్లో కొన్ని విచిత్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారంధరలు జులై 24,25 తేదీలలో కొంత మేర వెనక్కి తగ్గాయి.ఇప్పుడు దేశవ్యాప్తంగా బంగారం ధర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

వివరాలు 

ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ & సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి: 

భారతదేశం : 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు): ₹1,00,960, 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు): ₹92,540 ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు: ఢిల్లీ: 24 క్యారెట్ల ధర: ₹1,01,110 22 క్యారెట్ల ధర: ₹92,540 ముంబై: 24 క్యారెట్ల ధర: ₹1,00,960 22 క్యారెట్ల ధర: ₹92,540 చెన్నై: 24 క్యారెట్ల ధర: ₹1,00,960 22 క్యారెట్ల ధర: ₹92,540 బెంగళూరు: 24 క్యారెట్ల ధర: ₹1,00,960 22 క్యారెట్ల ధర: ₹92,540 హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు): ₹1,00,960 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹92,540 విజయవాడ & విశాఖపట్నం: 24 క్యారెట్ల ధర: ₹1,00,960 22 క్యారెట్ల ధర: ₹92,540