LOADING...
Gold Rates: రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్,విజయవాడలో తాజా ధరలు ఎలాఉన్నాయంటే..?
హైదరాబాద్,విజయవాడలో తాజా ధరలు ఎలాఉన్నాయంటే..?

Gold Rates: రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్,విజయవాడలో తాజా ధరలు ఎలాఉన్నాయంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయంగా బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ట్రేడింగ్ జరుగుతోంది. అలాగే వెండి ధరలు కూడా పసిడి బాటలోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి, బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు తరచుగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు తగ్గిపోతాయి, మరికొన్నిసార్లు పెరుగుతాయి. అయితే, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితులు, విదేశీ ట్రేడింగ్ విధానాల ప్రభావంతో బంగారం ధరలు ఇంకా పెరుగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

దేశీయంగా బంగారం, వెండి ధరలు: 

తాజాగా, సెప్టెంబర్ 2, 2025, మంగళవారం ఉదయం ఆరుగంటల వరకు రికార్డ్ చేసిన ధరల ప్రకారం దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరుగుతూ రూ.1,05,890 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరుగుతూ రూ.97,060 కి చేరింది. వెండి (Silver) కిలో ధర రూ.100 పెరుగుతూ రూ.1,26,100 గా నమోదైంది.

వివరాలు 

ప్రాంతాల వారీగా ధరల్లో కొంత తేడా ఉంటుంది. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి: 

హైదరాబాద్: 24 క్యారెట్లు - 10 గ్రా:రూ.1,05,890 22 క్యారెట్లు -10 గ్రా: రూ.97,060 వెండి (కిలో): రూ.1,36,100 విజయవాడ & విశాఖపట్నం: 24 క్యారెట్లు - 10 గ్రా: రూ.1,05,890 22 క్యారెట్లు - 10 గ్రా: రూ.97,060 వెండి (కిలో): రూ.1,36,100 దిల్లీ: 24 క్యారెట్లు - 10 గ్రా: రూ.1,06,040 22 క్యారెట్లు - 10 గ్రా: రూ.97,210 వెండి (కిలో): రూ.1,26,100 ముంబై: 24 క్యారెట్లు - 10 గ్రా: రూ.1,05,890 22 క్యారెట్లు - 10 గ్రా: రూ.97,060 వెండి (కిలో): రూ.1,26,100 చెన్నై: 24 క్యారెట్లు - 10 గ్రా: రూ.1,05,890 22 క్యారెట్లు - 10 గ్రా: రూ.97,060 వెండి (కిలో): రూ.1,36,100

వివరాలు 

ప్రాంతాల వారీగా ధరల్లో కొంత తేడా ఉంటుంది. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి: 

బెంగళూరు: 24 క్యారెట్లు - 10 గ్రా: రూ.1,05,890 22 క్యారెట్లు - 10 గ్రా: రూ.97,060 వెండి (కిలో): రూ.1,26,100 గమనిక: బంగారం, వెండి ధరలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. తాజా అప్‌డేట్ తెలుసుకోవడానికి, 8955664433 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.