
Gold and Silver Rates Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల..నేటి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మధ్యకాలంలో పసిడి ధర మళ్లీ లక్ష రూపాయలకు చేరువ అవుతోంది. గత వారం కాలంలో 98 వేల రూపాయల సమీపంలో కొనసాగిన 10 గ్రాముల బంగారం ధర, ప్రస్తుతం మళ్లీ లక్షకు చేరువ అవుతోంది. ఇదిలా ఉండగా, ఈరోజు (జులై 16) ఉదయం 6.30 గంటలకు నమోదైన తాజా రేట్ల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,760గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.91,440గా నమోదైంది. నిన్నటి ధరలతో పోలిస్తే పసిడి ధర సుమారుగా రూ.140 వరకు తగ్గింది.
వివరాలు
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,910
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,910గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,590గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,760కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.91,440గా కొనసాగుతోంది. వెండి ధరలను పరిశీలిస్తే, నిన్నటి తో పోల్చితే సుమారు వంద రూపాయల మేర తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 99, 760, రూ. 91, 440 విజయవాడలో రూ. 99, 760, రూ. 91, 440 ఢిల్లీలో రూ. 99, 910, రూ. 91, 590 ముంబైలో రూ. 99, 760, రూ. 91, 440 వడోదరలో రూ. 99, 810, రూ. 91, 490 కోల్‌కతాలో రూ. 99, 760, రూ. 91, 440 చెన్నైలో రూ. 99, 760, రూ. 91, 440 బెంగళూరులో రూ. 99, 760, రూ. 91, 440 కేరళలో రూ. 99, 760, రూ. 91, 440 పుణెలో రూ. 99, 760, రూ. 91, 440
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 24, 900 విజయవాడలో రూ. 99, 890, రూ. 91, 560 ఢిల్లీలో రూ. 1, 14, 900 చెన్నైలో రూ. 1, 24, 900 కోల్‌కతాలో రూ. 1, 14, 900 కేరళలో రూ. 1, 24, 900 ముంబైలో రూ. 1, 14, 900 బెంగళూరులో రూ. 1, 14, 900 వడోదరలో రూ. 1, 14, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 14, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.