
Gold Rates: పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం, వెండి ప్రేమికులకు శుభవార్త. నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 15, 2025 ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,11,160కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,890గా నమోదైంది. నిన్నటి ధరలతో పోల్చితే ఇది కేవలం రూ.10 తగ్గిన స్థాయి మాత్రమే. ఢిల్లీలో కేజీ వెండి ధర కూడా రూ.100 తగ్గి రూ.1,32,900కి చేరింది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
గ్లోబల్ మార్కెట్‌లో మార్పుల కారణంగా భారతదేశంలో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రధాన నగరాల వారీగా ధరలు ఈ విధంగా ఉన్నాయి: ఢిల్లీ: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం - రూ.1,11,290; 22 క్యారెట్ - రూ.1,02,040; కేజీ వెండి - రూ.1,32,900 హైదరాబాద్: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం- రూ.1,11,160; 22 క్యారెట్ - రూ.1,01,890; కిలో వెండి - రూ.1,42,900 ముంబై: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం- రూ.1,11,160; 22 క్యారెట్ - రూ.1,01,890; కిలో వెండి - రూ.1,32,900 చెన్నై: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం- రూ.1,11,170; 22 క్యారెట్ - రూ.1,02,190; కిలో వెండి - రూ.1,42,900
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
బెంగళూరు: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం - రూ.1,11,160; 22 క్యారెట్ - రూ.1,01,890; కిలో వెండి - రూ.1,32,900 కోల్‌కతా: 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం - రూ.1,11,160; 22 క్యారెట్ - రూ.1,01,890; కిలో వెండి - రూ.1,32,900 గమనిక: ఈ ధరలు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న తాజా సమాచారం. ఈ రోజు చివర వరకు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. అందుకే పసిడి కొనుగోలు చేసే ముందు ధరలను మళ్లీ తనిఖీ చేసుకోవడం అవసరం. గ్లోబల్ ఫ్యాక్టర్స్, అమెరికా ఫెడ్ రేట్స్, ఇన్‌ఫ్లేషన్ మరియు ఇతర ఆర్థిక నిర్ణయాలు కూడా బంగారం, వెండి ధరలకు ప్రభావం చూపుతాయి.