LOADING...
Gold Rates: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..! 
మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Gold Rates: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనేవారికి మరోసారి ధరలు షాక్ ఇచ్చాయి. కొన్ని రోజుల పాటు తగ్గుతూ గోల్డ్ ప్రేమికులకు ఊరట ఇచ్చిన ధరలు.. ఇప్పుడు మళ్లీ పైకెళ్లడం మొదలైంది. శుక్రవారం కూడా బంగారం రేట్లు మరోసారి పెరిగిపోయాయి. అయితే వెండి మాత్రం కొంతవరకు ఊరట ఇచ్చింది. తులం బంగారం ధరలో రూ.220 వరకూ పెరుగుదల కనిపించగా.. కిలో వెండిపై మాత్రం రూ.4,000 వరకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.1,24,480 వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా వెండి ధరలు

22 క్యారెట్ల బంగారం కూడా రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.1,14,100 వద్ద విక్రయిస్తున్నారు. ఇంకా 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.170 ఎగసి రూ.93,360 వద్ద ఉండింది. మరోవైపు వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా తగ్గాయి. కిలో వెండి మీద రూ.4,000 తగ్గడంతో మార్కెట్‌లో ధర రూ.1,61,000 వద్దకు చేరింది. చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా.. అన్నీ చోట్లా కిలో వెండి ఇదే రూ.1,61,000 వద్దే విక్రయించబడుతోంది.