
Gold Rate: మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర.. ఒక్క రోజులో రూ.4వేలు పెరిగిన వెండి!
ఈ వార్తాకథనం ఏంటి
కొంతకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా దూసుకుపోతున్నాయి. ఇటీవల రూ.1,00,000 మార్కును టచ్ చేసిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆ తర్వాత కొంతకాలం స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పెరిగిపోతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతుండగా, శనివారం (జులై 12) కూడా అదే ధోరణి కొనసాగింది. గురువారం రూ.200, శుక్రవారం రూ.550 పెరిగిన బంగారం ధర.. శనివారం మరింత పెరిగి రూ.650కి చేరింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,400గా ఉంది.
Details
22 క్యారెట్ల ధర రూ.91,550
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల ధర రూ.91,550గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.99,860గా నమోదైంది. ప్రాంతాలవారీగా స్వల్ప భేదాలు ఉండే అవకాశముంది.
Details
రికార్డు స్థాయిలో వెండి పెరుగుదల
ఇక వెండి ధరలు కూడా వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు.. గత రెండు రోజులుగా పెరుగుదలతో ఆకస్మాత్తుగా పైకి లాగాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.1,000 పెరగగా.. శనివారం నాటికి ఏకంగా రూ.4,000 ఎగబాకింది. ఫలితంగా బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,15,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ధర మరింత ఎక్కువగా రూ.1,25,000గా ఉంది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ రూ.1,15,000 వద్ద కొనసాగుతోంది.