LOADING...
Gold Rates: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తులంపై రూ.900 పెంపు!
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తులంపై రూ.900 పెంపు!

Gold Rates: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తులంపై రూ.900 పెంపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ ప్రజలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఇప్పటికే ఎగిసి పడుతున్న ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి. నేటి ట్రేడింగ్‌లో ఒక్కరోజులోనే తులం బంగారం ధర రూ.930 పెరిగి పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. వెండి కూడా అదే బాటలో సాగి భారీగా పెరిగింది. నేటి రోజున కిలో వెండి ధర రూ.1,000 మేర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.10,588కి చేరగా, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.9,705గా ఉంది.

Details

దిల్లీలో కిలో వెండి రూ.1,26,000

బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి రూ.97,050కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 ఎగబాకి రూ.1,05,880 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు అమలులో ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,030 వద్ద నమోదైంది. మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,36,000కు చేరగా, దిల్లీలో కిలో వెండి రూ.1,26,000 వద్ద ట్రేడ్ అవుతోంది.