Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్.. 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభమైన సోమవారమే గోల్డ్ రేట్లు పైకి ఎగబాకాయి. గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ.3 వేలకుపైగా పెరిగిన విషయం తెలిసిందే. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. తాజాగా సోమవారం కూడా ధరలు పెరగడంతో ఈ వారం సైతం పసిడి రేట్లు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్ట్ 17న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివరాలు
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కు చేరింది. సోమవారం ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,700గా ఉంది. ఈ రేటు కూడా నేడు రూ.500 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ హైదరాబాద్‌లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.
చెన్నై, బెంగళూరులో..
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,120గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,42,190 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా కొనసాగుతోంది.
వివరాలు
ఢిల్లీ, ముంబైలో ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉంది. సోమవారం ఒక్కరోజే ఈ ధర రూ.530 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,850గా ఉండగా.. నేడు రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,660గా, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,700గా కొనసాగుతోంది.
వెండి ధరలు..
బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ముంబైలో కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది. ఢిల్లీలోనూ కిలో వెండి ఇదే ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉండగా.. చెన్నైలోనూ కిలో వెండి రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.