
Gold Price Today : రాకెట్ వేగంతో పెరుగుతున్న బంగారం,వెండి ధరలు.. నేటి ధరలు ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
దసరా,దీపావళి వంటి ప్రధాన పండుగల సందర్భంలో బంగారం ధరలు విశేషంగా పెరుగుతున్నాయి. ఈ వేగవంతమైన పెరుగుదలతో గోల్డ్ రేట్లు అన్ని సమయాల్లో ఉన్న గరిష్ట స్థాయిలను తాకే అవకాశం ఉంది. గడిచిన 10 రోజులలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.6,000 పెరుగుదల నమోదు అయ్యింది. బుధవారం బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదు అయింది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.880 పెరిగింది. 22 క్యారట్ల బంగారం ధర కూడా రూ.800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర 10 డాలర్లు పెరిగి ప్రస్తుతానికి 3,537 డాలర్ల వద్ద నిలిచింది.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు
అలాగే, వెండి ధరలు కూడా అధిక స్థాయిలను చేరుకున్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.900 పెరిగి గడిచిన ఐదు రోజులలో సుమారు రూ.7,500 పెరుగుదలను చూశాం. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు, దేశంలోని ఇతర నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి: బంగారం ధరలు - తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం: 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం: రూ.98,050 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం: రూ.1,06,970
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాలు
ఢిల్లీ: 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం: రూ.98,200 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,07,120 ముంబై, బెంగళూరు, చెన్నై: 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం: రూ.98,050 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,06,970 వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం: కిలో వెండి ధర రూ.1,37,000 ఢిల్లీ, ముంబై, బెంగళూరు: కిలో వెండి ధర రూ.1,27,000 చెన్నై: కిలో వెండి ధర రూ.1,37,000 గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.