Gold Price: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.ఇటీవల కొంతకాలం తగ్గుముఖం పట్టి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చిన పసిడి రేట్లు ఇప్పుడు మరోసారి పెరుగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు,రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ తీవ్రతరమైన ఘర్షణలు వంటి పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ ప్రభావం సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పడుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఇక గత వారం రోజుల్లోనే బంగారం ధర రూ.3వేలకుపైగా పెరగడం గమనార్హం.తాజాగా కూడా పసిడి రేట్లు స్వల్పంగా పెరిగాయి.
వివరాలు
రూ.100 తగ్గిన వెండి
వివిధ వెబ్‌సైట్లలో నమోదైన ధరలను ఆధారంగా చేసుకుని మంగళవారం (ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు దేశీయ మార్కెట్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,670గా కొనసాగుతోంది.
22 క్యారెట్ల బంగారం ధర
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు కూడా రూ.10 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,710గా ఉంది.
వెండి ధర
మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. కిలో వెండి ధరపై రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,49,900గా కొనసాగుతోంది.
వివరాలు
హైదరాబాద్‌లో బంగారం,వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.1,42,710గా నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ.2,54,900గా కొనసాగుతోంది.
విజయవాడ,విశాఖపట్నంలో ధరలు
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,710గా కొనసాగుతోంది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.
ఢిల్లీలో బంగారం,వెండి రేట్లు
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,820గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,860గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.
వివరాలు
ముంబైలో పసిడి, వెండి ధరలు
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,710గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది.
చెన్నైలో బంగారం, వెండి రేట్లు
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,710గా ఉంది. కిలో వెండి ధర రూ.2,54,900గా కొనసాగుతోంది.
బెంగళూరులో ధరలు
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,710గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.
వివరాలు
నగరాల మధ్య ఎందుకు తేడా?
బంగారం, వెండి ధరలు దేశంలోని అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్, సరఫరా, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఇతర మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.
అందుకే హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా పసిడి, వెండి రేట్లలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి.
బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్స్ తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చని సమాచారం.
గమనిక: పైన పేర్కొన్న ధరలు వివిధ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ఆధారంగా ఇచ్చినవి. నగలు కొనుగోలు చేసే సమయంలో స్థానికంగా అమలులో ఉన్న ధరలు, జీఎస్టీ, తయారీ ఛార్జీలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.