LOADING...
Gold Price: ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Price: ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ధోరణికి అనుగుణంగా దేశీయంగానూ బంగారం విలువ ఎగబాకుతూ సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పసిడి ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకోగా.. వెండి కూడా భారీ పెరుగుదలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర లక్షా 11 వేల మార్క్‌ను దాటింది. వెండి కిలో ధర కూడా లక్షా 33 వేలకు చేరింది. తాజాగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14, 2025 (ఆదివారం) ఉదయం 6 గంటలకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Details

బంగారం ధరలు ఇవే

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹1,11,170 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹1,01,900 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹83,370 వెండి కిలో ధర: ₹1,33,000 అయితే ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.

Details

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌ : 24 క్యారెట్ల బంగారం 10గ్రా - ₹1,11,170, 22 క్యారెట్ల - ₹1,01,900. వెండి కిలో - ₹1,43,000. విజయవాడ, విశాఖపట్నం**: 24 క్యారెట్ల బంగారం - ₹1,11,170, 22 క్యారెట్ల - ₹1,01,900. వెండి కిలో - ₹1,43,000. ఢిల్లీ : 24 క్యారెట్ల బంగారం - ₹1,11,300, 22 క్యారెట్ల - ₹1,02,050. వెండి కిలో - ₹1,33,000. ముంబై: 24 క్యారెట్ల బంగారం - ₹1,11,170, 22 క్యారెట్ల - ₹1,01,900. వెండి కిలో - ₹1,33,000. చెన్నై : 24 క్యారెట్ల బంగారం - ₹1,11,710, 22 క్యారెట్ల - ₹1,02,200. వెండి కిలో - ₹1,43,000.