
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల జోరు.. ఎక్కడ ఎక్కువో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు ఎగబాకడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతుండటం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి అధిక డిమాండ్ ఉండటం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ ప్రజలకు బంగారం అందని ద్రవ్యంగా మారింది. ఒకరోజు ధరలు స్వల్పంగా తగ్గినా, మరుసటి రోజే మళ్లీ పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 16న మాత్రం ధర కొంత తగ్గినా, వినియోగదారులకు అది పెద్ద ఊరట కాదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1,11,050 వద్ద ఉంది.
Details
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,200 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,01,940. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,11,050, 22 క్యారెట్ల ధర రూ.1,01,790. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,11,050, 22 క్యారెట్ల ధర రూ.1,01,790. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,11,370, 22 క్యారెట్ల ధర రూ.1,02,090. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,11,050, 22 క్యారెట్ల ధర రూ.1,01,790. విజయవాడలో 24 క్యారెట్ల ధర రూ.1,11,050, 22 క్యారెట్ల ధర రూ.1,01,790. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,32,900 కాగా, హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అది మరింత ఎక్కువగా రూ.1,42,900 ఉంది.