
Gold: పసిడి ప్రియులకు షాక్.. ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పసిడి ప్రియులకు ధరలు మరోసారి షాక్ ఇచ్ఛాయి. ధరలు తగ్గుతాయని ఆశిస్తే దానికి భిన్నంగా,కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎప్పుడూ చూడని స్థాయికి చేరడంతో, గోల్డ్ లవర్స్ కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుత ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. బుధవారం బంగారం ధరల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ. 219 పెరిగి, రూ.1,10,509 వద్ద అమ్ముడవుతోంది.
వివరాలు
వెండి ధర కూడా పైపైకి..
అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి, రూ.1,01,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.160 పెరిగి, రూ.82,880 వద్ద మార్కెట్లో లభిస్తోంది. ఇక కిలో వెండి ధర కూడా రూ.1,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, చెన్నైలో వెండి ధర కిలోకి రూ.1,40,000 వద్ద అమ్ముడవుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో వెండి ధర కిలోకు రూ.1,30,000 వద్ద ట్రేడింగ్ అవుతుంది.