Gold Rate Today: ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
కొన్నేళ్ల తరువాత మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ప్రారంభంలో మూడు రోజుల పాటు గణనీయంగా పెరిగిన బంగారం ధర, తర్వాత రెండు రోజులు స్థిరంగా నిలిచింది. అయినా, కొనుగోలు దారులకు ఊరట కలిగిస్తూ ఇవాళ ధరలు తగ్గాయి. దేశీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. ఆ క్రమంలో గరిష్ఠ స్థాయిలను కూడా తాకాయి. ప్రతి సెషన్‌లో కొత్త గరిష్ఠాలను నమోదు చేసిన బంగారం, అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. కొన్నాళ్ల విరామం తర్వాత ఇవాళ బంగారం ధరలు తగ్గాయి.
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,450
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2635 డాలర్ల వద్ద ఉంది. గత రోజున ఇది 2650 డాలర్లపైన ఉంది. స్పాట్ సిల్వర్ ధర కూడా 31.20 డాలర్లకు దిగొచ్చింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే పతనమవుతూ రూ. 84.053 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 తగ్గడంతో 10 గ్రాముల ధర ఇప్పుడు రూ. 71,000కి పడిపోయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ. 220 తగ్గి ప్రస్తుతం తులం రూ. 77,450 వద్ద ఉంది. దిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 తగ్గి రూ. 71,150కి పడిపోయింది.
స్థిరంగా వెండి ధరలు
24 క్యారెట్ల పసిడి ధర రూ. 220 తగ్గి 10 గ్రాములకు రూ. 77,600కి చేరింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర తగ్గినప్పటికీ, దేశీయంగా మాత్రం పెద్దగా మార్పు లేదు. దిల్లీలో వెండి కేజీ ధర రూ. 97,000 వద్ద ఉంది, అయితే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1.03 లక్షలుగా ఉంది. స్థానిక పన్నులు, ఇతర ప్రాంతీయ కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి, అందుకే హైదరాబాద్‌లో కంటే దిల్లీలో బంగారం ధర ఎక్కువగా, వెండి ధర తక్కువగా ఉంటాయి.