Page Loader
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధర పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.97,310కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.89,200గా నమోదైంది. ఇదే విధంగా 18 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి రూ.72,990గా ఉంది

Details

ఢిల్లీ, ముంబై నగరాల్లో పరిస్థితి ఇలా ఉంది

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.97,46, 22 క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ.89,350, 18 క్యారెట్ల ధర రూ.210 పెరిగి రూ.73,110గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ.89,200, 18 క్యారెట్ల ధర రూ.210 పెరిగి రూ.72,990గా ఉంది.

Details

వెండి ధరల్లో మార్పు లేదు

వెండి ధరల్లో మాత్రం మార్పులేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివిధ నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి: హైదరాబాద్ - కిలో వెండి ధర: రూ.1,10,900 విజయవాడ - కిలో వెండి ధర: రూ. 1,10,900 విశాఖపట్నం - కిలో వెండి ధర: రూ.1,10,900 ఢిల్లీ - కిలో వెండి ధర: రూ.99,900 ముంబై - కిలో వెండి ధర: రూ.99,900 ఈ ధరలు ఉదయం 9:00 గంటల సమయానికి నమోదైనవే. మార్కెట్ వృద్ధి, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు తదితర అంశాలపై ఆధారపడి ఈ ధరలు మారవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.