LOADING...
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరలు రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,11,290కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,010గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,11,440, 22 క్యారెట్ల ధర రూ. 1,02,160గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల ధర రూ. 1,11,290, 22 క్యారెట్ల ధర రూ. 1,02,010కి చేరింది.

Details

వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే పెరిగాయి

హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ: రూ. 1,42,100 ముంబై, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, ఢిల్లీ, అహ్మదాబాద్: రూ. 1,32,100 ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (24, 22 క్యారెట్): హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణె: రూ. 1,11,290, రూ. 1,02,010 వడోదర : రూ. 1,11,340, రూ. 1,02,060 ఢిల్లీ : రూ. 1,11,440, రూ. 1,02,160 ఈ రికార్డు పెరుగుదలతో బంగారం, వెండి కొనుగోలుదారులు తారుమారవుతున్న పరిస్థితి నెలకొన్నది. పెట్టుబడిదారులు ఇప్పుడు సురక్షిత ఆస్తుల వైపు మరింత ఆసక్తి చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.