Gold Rates: మళ్లీ ఎగబాకిన గోల్డ్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొన్నిరోజులుగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన గోల్డ్ రేట్లు మళ్లీ ఒక్కసారిగా ఎగబాకి షాకిస్తున్నాయి. శనివారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా వివరాల ప్రకారం తులం బంగారం ధర రూ.1,860 పెరిగింది కిలో వెండి ధరపై రూ.3,000 పెరిగింది ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 పెరిగి రూ.1,15,350 వద్దకు చేరింది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,390 పెరిగి రూ.94,380 వద్ద ఉంది.
Details
నగరాల వారీగా ఎలా ఉందంటే?
బంగారంతో పాటు వెండి కూడా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కిలో వెండిపై రూ.3,000 పెరుగుదలతో బులియన్ మార్కెట్‌లో రూ.1,64,000 వద్ద ధర పలుకుతోంది. నగరాల వారీగా చూస్తే చెన్నై, హైదరాబాద్: కిలో వెండి రూ.1,72,000 ఢిల్లీ, ముంబై, కోల్‌కతా: కిలో వెండి రూ.1,64,000 బంగారం వెండి రేట్ల ఈ వేగవంతమైన హెచ్చుతగ్గులు మార్కెట్‌లో కలకలం రేపుతున్నాయి.