LOADING...
Gold Rate Today: ఆరు రోజుల్లోనే రూ.6 వేలు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు!
ఆరు రోజుల్లోనే రూ.6 వేలు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు!

Gold Rate Today: ఆరు రోజుల్లోనే రూ.6 వేలు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆల్‌టైమ్ రికార్డుకు తాకుతూ, కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.6 వేలు పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,490గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీ పెరుగుదల కనబరుస్తోంది. షేర్ మార్కెట్‌ నుంచి బులియన్ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు భారీగా ఆకర్షితులవుతుండడం, రూపాయి బలహీనపడడం, పండుగలు-పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాలు డిమాండ్‌ను పెంచి బంగారం, వెండి రేట్లను భగ్గుమనిపిస్తున్నాయి. ఈ ఏడాది వెండి ధర దాదాపు 42 శాతం పెరిగింది. అయితే దేశీయంగా సెప్టెంబర్ 7, 2025 (ఆదివారం) నాటికి బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Details

వెండి కిలో ధర: రూ.1,28,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ.1,08,490 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ.99,450 వెండి కిలో ధర: రూ.1,28,000 ప్రాంతాల వారీగా బంగారం,వెండి ధరల్లో కొద్దిపాటి తేడాలు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌: 24 క్యారెట్లు రూ.1,08,490 | 22 క్యారెట్లు రూ.99,450 | వెండి రూ.1,38,000/కిలో విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్లు రూ.1,08,490 | 22 క్యారెట్లు రూ.99,450 | వెండి రూ.1,38,000/కిలో ఢిల్లీ: 24 క్యారెట్లు రూ.1,08,620 | 22 క్యారెట్లు రూ.99,600 | వెండి రూ.1,28,000/కిలో ముంబై: 24 క్యారెట్లు రూ.1,08,490 | 22 క్యారెట్లు రూ.99,450 | వెండి రూ.1,28,000/కిలో