
Gold Rates: అమ్మబాబోయ్..రికార్డు స్థాయికి బంగారం-వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల బంగారం ధరలు పరుగులు పెడుతోంది. పసిడి ధర గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీగా పెరుగుతూ లక్షా 10 వేల మార్క్‌ను దాటింది. దీనితో పాటు బంగారంతోపాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. మంగళవారం (సెప్టెంబర్ 9, 2025) లెక్కల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఒక్కసారి రూ.1,360 చొప్పున పెరిగి 1,10,290కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,250 చొప్పున పెరిగి 1,01,100కి చేరింది. వెండి ధర కూడా కిలోపై రూ.3,000 పెరిగి 1,30,000కి చేరింది. కాగా, ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో తేడా ఉండవచ్చు.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం-వెండి ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,290, 22 క్యారెట్ల ధర 1,01,100, వెండి కిలో ధర 1,40,000. విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,290, 22 క్యారెట్ల ధర 1,01,100, వెండి కిలో ధర 1,40,000. న్యూఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర 1,10,440, 22 క్యారెట్ల ధర 1,01,250, వెండి కిలో ధర 1,30,000. ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర 1,10,290, 22 క్యారెట్ల ధర 1,01,100, వెండి కిలో ధర 1,30,000. చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర 1,10,730, 22 క్యారెట్ల ధర 1,01,500, వెండి కిలో ధర 1,40,000.
వివరాలు
భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే ఛాన్స్
ట్రంప్ సుంకాల సీజన్ ప్రారంభమైనప్పటి నుండి బంగారం ధరలు టాప్‌గేర్‌లో పరుగులు పెడుతోంది. గత రెండు నెలలలో పసిడి స్పీడుకు పగ్గాలు పడటం లేదు. భవిష్యత్తులో కూడా మరింత పెరుగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గమనిక: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. లేటెస్ట్ అప్‌డేట్ కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ చేయవచ్చు.