LOADING...
Gold Rates: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Gold Rates: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరుగుదలను నమోదుచేశాయి. మొత్తం మీద దాదాపు రూ.2,700 వరకూ విలువ పెరిగినట్లు మార్కెట్‌ సమాచారం. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో తగ్గింపు వచ్చే అవకాశాలు బలపడడంతో పాటు,డాలర్ నిరాశాజనకంగా బలహీనపడటం కూడా పసిడి ధరలకు ఊపిరినిచ్చింది. గుడ్‌ రిటర్న్స్‌ సమాచారం ప్రకారం,గురువారం ఉదయం 6.30గంటల సమయానికి దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,920గా నమోదైంది. అదే 22క్యారెట్ 10గ్రాముల గోల్డ్‌ ధర రూ.1,17,920కు చేరి మరింత ఎగువస్థాయిని తాకింది. వెండి కూడా ఇదే సమయంలో భారీగా పెరిగి,కేవలం రెండు రోజుల్లోనే రూ.6,000కు పైగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండికి మార్కెట్ రేటు రూ.1,69,100 ఉండగా ట్రేడ్‌ కొనసాగుతోంది.

వివరాలు 

డాలర్ సూచీ 100మార్క్ కంటే దిగువకు పడిపోవడంతో పసిడి ధరలకు మరింత బలం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే తన కీలక వడ్డీ రేట్లలో తగ్గింపు చేపట్టవచ్చన్న అంచనాలు ఈ పెరుగుదలకు ప్రధాన శక్తిగా పనిచేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్ మీటింగ్‌లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడ్‌ అధికారులు సంకేతాలివ్వడంతో మార్కెట్లలో ఉత్సాహం పెరిగింది. ఇదే సమయంలో డాలర్ సూచీ 100మార్క్ కంటే దిగువకు పడిపోవడంతో పసిడి ధరలకు మరింత బలం వచ్చింది. అయితే ఈ వేగవంతమైన పెరుగుదల ఎక్కువకాలం నిలవకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకోవడంతో గ్లోబల్‌ జియోపాలిటికల్‌ ఒత్తిడులు తగ్గుతున్నాయి. ఫలితం— సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం డిమాండ్ తగ్గి, మళ్లీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వివరాలు 

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ (24కే, 22కే, 18కే) 

చెన్నై: ₹1,28,740; ₹1,18,010; ₹98,460 ముంబై: ₹1,27,920; ₹1,17,260; ₹95,940 న్యూఢిల్లీ: ₹1,28,070; ₹1,17,410; ₹96,090 కోల్‌కతా: ₹1,27,920; ₹1,17,260; ₹95,940 బెంగళూరు: ₹1,27,900; ₹1,17,240; ₹95,940 హైదరాబాద్: ₹1,27,920; ₹1,17,260; ₹95,940 విజయవాడ: ₹1,27,920; ₹1,17,260; ₹95,940 కేరళ: ₹1,27,910; ₹1,17,240; ₹95,930 పుణె: ₹1,27,920; ₹1,17,260; ₹95,940 వడోదరా: ₹1,27,970; ₹1,17,310; ₹95,990 అహ్మదాబాద్: ₹1,27,970; ₹1,17,310; ₹95,990

Advertisement

వివరాలు 

కిలో వెండి ధరలు ఇవీ 

చెన్నై: ₹1,76,100 ముంబై: ₹1,69,100 న్యూఢిల్లీ: ₹1,69,100 కోల్‌కతా: ₹1,69,100 బెంగళూరు: ₹1,69,100 హైదరాబాద్: ₹1,76,100 విజయవాడ: ₹1,76,100 కేరళ: ₹1,76,100 పుణె: ₹1,69,100 వడోదరా: ₹1,69,100 అహ్మదాబాద్: ₹1,69,100 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలను మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

Advertisement