
Gold Price: అక్షయ తృతీయ కానుకగా బంగారం ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అక్షయ తృతీయను ముందు బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఫ్యూచర్స్ మార్కెట్ అయిన MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.12,00 పెరిగి రూ.93,224 వద్ద ట్రేడవుతోంది.
దేశీయ మార్కెట్‌లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపిస్తూ, 10 గ్రాముల బంగారం ధర రూ.95,400 కు చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.97,100గా కొనసాగుతోంది.
ఏప్రిల్ 11 ఉదయం 11 గంటల వరకు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,850, 24 క్యారెట్లపై రూ.2,020 పెరుగుదల నమోదైంది. దీంతో బంగారం రేట్లు రికార్డు స్థాయిని తాకాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,550కు చేరుకుంది.
Details
బంగారం లక్షకు చేరే అవకాశం
ముంబై, హైదరాబాద్ వంటి ముఖ్య నగరాల్లో 10 గ్రాములకు రూ.95,400 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.87,450కి లభిస్తోంది. బంగారం ధరల పెరుగుదలపై ప్రభావం చూపే కారణాల్లో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ రేట్లు, డాలర్-రూపీ మారకపు విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంగారు దిగుమతులపై సుంకాలు విధించడంతో ధరలు స్థిరంగా ఉండగా, ఇప్పుడు తిరిగి పెరుగుతున్నాయి.
దీంతో బంగారం లక్ష రూపాయల మార్క్‌ను దాటుతుందన్న అంచనాలున్నాయి. అయితే కొందరు నిపుణులు ధర రూ.56,000కి పడిపోతుందని చెబుతుండటం గమనార్హం.