
Gold Rates: మళ్లీ పసిడి రేటు పెరిగింది.. గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు శుక్రవారం అకస్మాత్తుగా పెరిగాయి. దాంతో గోల్డ్ లవర్స్ కు షాకే తగిలింది. సాధారణంగా బంగారం ధరలు రోజువారీ మార్పులకు లోనవుతుంటాయి. ఒకరోజు తగ్గితే మరుసటి రోజు పెరిగిపోతుంటుంది. ఇటీవల పసిడి ధర తులానికి లక్ష రూపాయలపైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది. కానీ శుక్రవారం మాత్రం మళ్లీ పెరిగింది. బులియన్ మార్కెట్ ప్రకారం, శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇది రూ.90,750 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతేకాక, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.600 పెరిగి, ప్రస్తుతం రూ.99,000 వద్ద ఉంది.
Details
కిలో వెండి ధర రూ.1,11,000
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. గురువారం కొంతమేర తగ్గిన వెండి ధర, శుక్రవారం మాత్రం ఆకస్మికంగా రూ.1,000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,11,000గా నమోదైంది. చెన్నైలో అయితే ఈ ధర మరింతగా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ.1,20,100గా ఉంది. కానీ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో మాత్రం వెండి ధర రూ.1,11,000 వద్దే ట్రేడవుతోంది. ఈ ధరల పెరుగుదల వెనుక గ్లోబల్ మార్కెట్ ప్రభావాలు, డిమాండ్, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశముంది. దీంతో, వచ్చే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో గమనించాల్సిందే.