Page Loader
Gold and Silver: బంగారం,వెండి ధరల్లో మరోసారి ఊరట.. తాజా రేట్లు ఇలా ..
బంగారం,వెండి ధరల్లో మరోసారి ఊరట.. తాజా రేట్లు ఇలా ..

Gold and Silver: బంగారం,వెండి ధరల్లో మరోసారి ఊరట.. తాజా రేట్లు ఇలా ..

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో సోమవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పడిపోగా, తాజా ధర రూ. 95,673గా నమోదైంది. ఇదే క్యారెట్ల 100 గ్రాముల ధర ప్రస్తుతం రూ. 9,56,730గా ఉంది. ఇక 1 గ్రాము బంగారం ధర రూ. 9,567గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, 10 గ్రాముల ధర రూ. 10 తగ్గి రూ. 87,713కు చేరింది. అదే 100 గ్రాముల ధర రూ. 8,77,130గా ఉంది. ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 8,771గా పలుకుతోంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం ధర 

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా సోమవారం బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,565గా ఉండగా,24క్యారెట్ల ధర రూ.95,525గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ. 87,713గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,673గా నమోదైంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,561 కాగా, 24 క్యారెట్ల ధర రూ.95,521గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 87,555గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,515గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold Rate Today Hyderabad): ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,569గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 95,529గా ఉంది.

వివరాలు 

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం 

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 87,575గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 95,535గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,577గా, 24 క్యారెట్ల ధర రూ. 95,537గా నమోదైంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ. 87,621గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,581గా ఉంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,560గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 95,520గా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ టారీఫ్ భయాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల మార్పులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని వెల్లడించారు.

వివరాలు 

వెండి ధరలు కూడా తగ్గుముఖం 

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా సోమవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 10,100గా ఉంది. ఒక కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 1,01,000కు చేరింది. హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర రూ. 1,12,400గా ఉంది. కోల్‌కతాలో వెండి ధర రూ. 1,01,800గా ఉండగా, విజయవాడలో ఇది రూ. 1,13,000కు చేరుకుంది. విశాఖపట్నంలో వెండి ధర ప్రస్తుతం రూ. 1,10,600గా ఉంది.