
Gold: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. జులై2 బుధవారం ధరలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెలలో బంగారం ధరలు క్రమంగా పడిపోతూ వచ్చాయి.అయితే నెలాఖరుకు చేరేసరికి ఈ ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.34,900 వరకు పడిపోవడంతో బంగారాన్ని ఇష్టపడే వినియోగదారులు సంతోషపడ్డారు. బంగారం ధరలు తగ్గుతున్నాయనే భావన ప్రజల్లో ఏర్పడింది.కానీ, ఈ తగ్గుదల ఎక్కువ కాలం నిలవలేదు. జూన్ 23నుండి జూన్ 30 వరకు.. అంటే కేవలం ఒక్క వారం రోజులు మాత్రమే బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే,జులై మొదటి రోజునే బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. జులై 1న పది గ్రాముల బంగారంపై రూ.1,140 మేర పెరుగుదల నమోదైంది. అంతేకాకుండా, జులై 2న కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగినట్టు ట్రెండ్ కనిపించింది.
వివరాలు
భారతదేశం లో జులై 2న గోల్డ్ రేట్‌లు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము): ₹9,841 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము): ₹9,021 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము): ₹7,381
వివరాలు
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం- ₹98,560, 22 క్యారెట్ల బంగారం- ₹90,360, వెండి (1 కిలో)- ₹1,10,100 ముంబై: 24 క్యారెట్ల బంగారం- ₹98,410. 22 క్యారెట్ల బంగారం- ₹90,210. వెండి (1 కిలో)- ₹1,10,100 చెన్నై: 24 క్యారెట్ల బంగారం- ₹98,410, 22 క్యారెట్ల బంగారం- ₹90,210, వెండి (1 కిలో)- ₹1,20,100 బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం- ₹98,410, 22 క్యారెట్ల బంగారం- ₹90,210, వెండి (1 కిలో)- ₹1,10,100 హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం- ₹98,410, 22 క్యారెట్ల బంగారం- ₹90,210, వెండి (1 కిలో)- ₹1,20,100 విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం-₹98,410, 22 క్యారెట్ల బంగారం- ₹90,210, వెండి(1 కిలో) ₹1,20,100