LOADING...
Gold and Silver Rates : స్థిరంగా బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే.. తులం రేటు ఎంతుందంటే?
తులం రేటు ఎంతుందంటే?

Gold and Silver Rates : స్థిరంగా బంగారం ధర.. ఈరోజు రేట్లు ఇవే.. తులం రేటు ఎంతుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయంగా బంగారం ధరలు చరిత్రలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు తమను రక్షించుకునే ఉద్దేశ్యంతో సురక్షిత ఆస్తులు వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీంతో బంగారం పై డిమాండ్ భారీగా పెరుగుతోంది. అదేవిధంగా, డాలర్‌ పరంగా రూపాయి విలువ క్షీణించడమూ బంగారం ధర పెరుగుదలకు మరో ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు (సెప్టెంబర్ 8న) 24 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు ధర రూ. 1,08,480కు చేరుకుంది. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు ధర రూ. 99,440కు పెరిగింది.

వివరాలు 

సుమారు రూ. 100 తగ్గిన వెండి

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,08,610గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు ధర రూ. 99,590కి చేరింది. హైదరాబాదు, విజయవాడలో కూడా 24 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు ధర రూ. 1,08,480గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు ధర రూ. 99,440కి పెరిగింది. అలాగే, వెండి ధరలు నిన్నటి కంటే కిలోగ్రామ్‌ కు సుమారు రూ. 100 తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో, దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం ఉన్న బంగారం మరియు వెండి రేట్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్‌లో రూ. 1, 08, 480, రూ. 99, 440, విజయవాడలో రూ. 1, 08, 480, రూ. 99, 440, ఢిల్లీలో రూ. 1, 08, 610, రూ. 99, 590, ముంబైలో రూ. 1, 08, 480, రూ. 99, 440, వడోదరలో రూ. 1, 08, 510, రూ. 99, 490, కోల్‌కతాలో రూ. 1, 08, 480, రూ. 99, 440, చెన్నైలో రూ. 1, 08, 480, రూ. 99, 440, బెంగళూరులో రూ. 1, 08, 480, రూ. 99, 440, కేరళలో రూ. 1, 08, 480, రూ. 99, 440, పుణెలో రూ. 1, 08, 480, రూ. 99, 440

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 37, 900, విజయవాడలో రూ. 1, 37, 900, ఢిల్లీలో రూ. 1, 27, 900, చెన్నైలో రూ. 1, 37, 900, కోల్‌కతాలో రూ. 1, 27, 900, కేరళలో రూ. 1, 27, 900, ముంబైలో రూ. 1, 27, 900, బెంగళూరులో రూ. 1, 27, 900, వడోదరలో రూ. 1, 27, 900, అహ్మదాబాద్‌లో రూ. 1, 27, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.