LOADING...
Gold, Silver Rates: పండగ పూట భారీగా తగ్గిన బంగారం ధరలు,హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold, Silver Rates: పండగ పూట భారీగా తగ్గిన బంగారం ధరలు,హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసే వారికి కొంత ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. దీంతో గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 10 గంటల సమయానికి మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,180గా నమోదైంది. ఇదే ధర ఉదయం 6 గంటలకు రూ.1,44,010గా ఉండగా, కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే తులం బంగారంపై రూ.830 మేర తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినా, వెండి మాత్రం సామాన్యుడికి మరింత భారంగా మారింది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

గురువారం నాలుగు గంటల్లోనే కేజీ వెండి ధర ఏకంగా రూ.3,000 పెరిగి ఆల్‌టైం హై స్థాయికి చేరింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.3,10,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,180గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,250 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,330గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,400గా ఉంది.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,490గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,900 వద్ద స్థిరపడింది. అలాగే ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, కేరళ వంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,180గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,250గా కొనసాగుతోంది.

Advertisement