
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తుండగా, శనివారం రోజున ఈ తగ్గుదల మరింతగా కనిపించింది. శుభకార్యాలు సమీపిస్తున్న నేపథ్యంలో, ధరలు తగ్గుతుండటంతో గోల్డ్ కొనుగోలుపై ప్రజలు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. బులియన్ మార్కెట్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.900 తగ్గి రూ.83,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.980 తగ్గి రూ.90,660గా ఉంది.
Details
తెలుగు రాష్ట్రాల్లో అదే ధరలు
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం నాటికి కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.94,000కి చేరింది. బంగారం, వెండి ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోలు అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు.