Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం మార్కెట్‌లో ఈ రోజు పసిడి ధరల్లో సగటు తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారుతూ కొనుగోలుదారుల నిరాశకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం పరిస్థితులు బాగున్నప్పటికీ దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో మగువలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ రోజు తులం గోల్డ్ ధరలో రూ.540 తగ్గుదల కనిపించింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.1,19,300 వద్ద, 18 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.410 తగ్గి రూ.97,610 వద్ద ట్రేడ్ అవుతోంది.
Details
భారీగా పెరుగుతున్న వెండి
వెండి ధరలో కొంత మార్పులొచ్చాయి. కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.1,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రాంతీయ ధరల్లో భిన్నతలు కనిపిస్తున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,99,000, హైదరాబాద్‌లో రూ.1,95,900 వద్ద, ఢిల్లీలో, ముంబైలో, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద అమ్ముడవుతోంది. ఈ ధరల పరిణామంతో బులియన్ మార్కెట్‌లో కొనుగోలు, అమ్మకాల్లో కొత్త మార్పులు సంభవించే అవకాశం ఉంది.