LOADING...
Gold Rates: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు!
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు!

Gold Rates: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా రెట్టింపు వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు చివరికి కాస్త నెమ్మదించాయి. అంతర్జాతీయంగా వాణిజ్య మార్పిడుల్లో నెలకొన్న అస్థిరత, పలు దేశాల్లో తలెత్తిన యుద్ధ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలతో ముడిపడి ఉన్న వాణిజ్య పన్నుల అంశాలు.. ఇవన్నీ బంగారానికి భారీగా మద్దతునిచ్చాయి. అయితే గత రెండు రోజులుగా ఆ ఒత్తిడిలో కొంత ఉపశమనం కనిపిస్తోంది.

Details

తాజా ధరలు ఇలా ఉన్నాయి

శుక్రవారం నాడు బంగారం ధరలు ఒక్కసారిగా రూ.1,360 తక్కువయ్యాయి. అదే జోరు కొనసాగుతూ తాజా మార్కెట్‌లో మరోసారి ధరలు పడిపోయాయి. 10 గ్రాముల బంగారంపై రూ.550 తగ్గుదల నమోదైంది. ఇది బంగారం కొనాలనుకునే వినియోగదారులకు ఊరట కలిగించే పరిణామం. 24 క్యారెట్ల బంగారం : గ్రాముకు రూ.550 తగ్గి, ప్రస్తుతం తులం ధర రూ.99,930గా ఉంది. 22 క్యారెట్ల బంగారం : గ్రాముకు రూ.500 తగ్గి, తులం ధర రూ.91,600గా ట్రేడవుతోంది. 18 క్యారెట్ల బంగారం : 10 గ్రాములకు రూ.410 తగ్గి, తాజా ధర రూ.74,950.

Details

 వెండిలో భారీ తగ్గుదల

బంగారంతో పాటు వెండి ధరలూ గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.2,000 తగ్గి ప్రస్తుతం రూ.1,26,000 వద్ద ఉంది. ప్రతి రోజూ మార్కెట్ ప్రకారం, ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరల్లో ఈ తాజా మార్పులు శ్రద్ధగా గమనించాల్సిన అంశం. కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయమా అనే దానిపై ప్రత్యేకంగా పరిశీలించి ముందడుగు వేయడం మేలు.