తదుపరి వార్తా కథనం
Jio: ఐపీఎల్‌కు ముందు జియో యూజర్లకు శుభవార్త.. 90 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 17, 2025
10:53 am
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది.
ఈ మ్యాచ్‌లను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఉచితంగా వీక్షించిన అభిమానులకు జియో-హాట్ స్టార్ విలీనం రూపంలో షాక్ తగిలింది.
ఇప్పటి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే లీగ్ ప్రారంభానికి ముందే జియో యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ అందించింది.
Details
ఉచితంగా జియో-హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
ఎంపిక చేసిన ప్లాన్లపై జియో యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చని ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల జియో యూజర్లు తక్కువ ఖర్చుతో ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎంజాయ్ చేయవచ్చు.
ఈ ప్రకటనపై జియో యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.