తదుపరి వార్తా కథనం

UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 14, 2024
10:41 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతేడాది ఆదాయపు పన్ను చెల్లింపుల సంబంధించి, రూ.5 లక్షల వరకు ఒకే సారి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతించింది.
ఈ మార్పు ఆదివారం నుంచి అమల్లోకి రానుంది.
'యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్ణయించింది.
ఈ మేరకు ఎన్‌పీసీఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని ఆస్పత్రి, విద్యా సంస్థల బిల్లుల చెల్లింపులకు కూడా ఉపయోగించవచ్చు.
ఐపీఓ దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు వంటి లావాదేవీలకు కూడా ఇది వర్తించనుంది.