
Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు పతనం!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు రోజు రోజుకు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి. ఒకరోజు తగ్గితే మరుసటి రోజు పెరుగుతున్నాయి. పసిడి భారతీయ సంస్కృతిలో కీలక భూమిక పోషిస్తుంది. మహిళలకు బంగారంపై ఉన్న ఆసక్తి ప్రత్యేకమైనది. ధరలు ఎంత పెరిగినా వారు కొనుగోలు చేయడంలో వెనుకాడరు. వివాహాలు, ఇతర శుభకార్యాల్లో బంగారానికి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. అయితే ఇటీవల బంగారం ధరలు ఆశ్చర్యకరంగా పెరిగి లక్ష రూపాయలు దాటిన విషయం తెలిసిందే. కానీ జూన్ 8వ తేదీన మాత్రం ఈ ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోల్చితే తులం బంగారం ధర ఏకంగా రూ.1,600 పైగా తగ్గింది.
Details
ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.98,120
మళ్లీ లక్షకు చేరువలో ఉన్న ధర, ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గడం విశేషం. హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,970గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.89,000గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.98,120 కాగా, 22 క్యారెట్ల ధర రూ.89,950గా ట్రేడ్ అవుతోంది. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌తో సమానంగా రూ.97,970గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.89,000 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర అదే స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.89,800గా ఉంది.
Details
కిలో వెండి ధర రూ.1,08,000
ఇక వెండి విషయానికొస్తే, కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇది రూ.1,18,000 వరకూ ఉంది. అయితే రాష్ట్రానుసారంగా ధరలు మారవచ్చునన్న విషయం గమనించాలి. అలాగే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు వంటి ఇతర ఖర్చులు కలిపితే మొత్తం ధర మరింత పెరిగే సూచనలున్నాయి. మొత్తానికి, బంగారం ధరల్లో వచ్చిన ఈ మాంద్యం కొనుగోలు దారులకు కాస్త ఊరట ఇచ్చే అవకాశం ఉంది.