Page Loader
Google: గూగుల్‌ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగాల కోత  
గూగుల్‌ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగాల కోత

Google: గూగుల్‌ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగాల కోత  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ తాజాగా ఉద్యోగుల తొలగింపు (Google Layoffs) ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా క్లౌడ్ డివిజన్‌లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లు సమాచారం. ఈ విషయంలో సంబంధిత వ్యక్తులు తెలియజేసిన వివరాలను బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగించిందనే విషయం స్పష్టంగా తెలియలేదు. అయితే, వంద మందికి పైగా ఉద్యోగులను తొలగించి ఉండొచ్చని, ఇది కేవలం కొన్ని టీమ్స్‌పైనే ప్రభావం చూపిందని సమాచారం.

vivaralu

ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన గూగుల్ 

గూగుల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ''కంపెనీ దీర్ఘకాలిక విజయాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారానికి కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని మార్పులు అమలు చేస్తున్నాం,'' అని తెలిపారు. అలాగే, కస్టమర్ల అవసరాలను అనుసరించి భవిష్యత్తులో అవకాశాలను వినియోగించుకునేందుకు అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక తాజాగా వచ్చిన త్రైమాసిక ఫలితాల్లో గూగుల్ తన క్లౌడ్ వ్యాపారంలో ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయింది. అలాగే, 2025 సంవత్సరానికి గాను మూలధన వ్యయాలు కూడా అంచనాలను మించిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య తగ్గించడం గమనార్హం.