SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా అమర రామమోహన రావు నియామకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి అయిన అమర రామమోహన రావు నియమితులయ్యారు. ఈ నియామకం సెప్టెంబరులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థాగత ఆర్థిక సేవల బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ)ద్వారా సిఫారసు చేయబడింది. కేంద్ర కేబినెట్ కమిటీ బుధవారం దీనికి ఆమోదం తెలిపింది.రామమోహన రావు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఇంజినీరింగ్ రంగంలో విద్యాభ్యాసం చేసిన రామమోహన రావు 1991లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. ప్రస్తుతం బ్యాంకు డిప్యూటీ ఎండీగా పని చేస్తున్నారు. గత 33 సంవత్సరాల నుండి ఆయన ఎస్‌బీఐలో వివిధ విభాగాల్లో కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది ఆగస్టు వరకు ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎండీ,సీఈఓగా పనిచేశారు.
ఎస్‌బీఐ చరిత్రలో రెండు కీలక పదవులు తెలుగు వ్యక్తులకు
అంతకుముందు ఎస్‌బీఐ భోపాల్ సర్కిల్‌లో సీజీఏన్‌గా, అలాగే సింగపూర్, అమెరికా దేశాలలో ఎస్‌బీఐలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రామమోహన రావు పనితీరు ఆధారంగా, ఆయన పదవీ కాలాన్ని రిటైర్మెంట్ వయసు 2028 ఫిబ్రవరి 29 వరకు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేయబడుతోంది. మరో తెలుగు వ్యక్తి అయిన శ్రీనివాసులు శెట్టి ఇప్పటికే ఎస్‌బీఐ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌బీఐ చరిత్రలో ఒకే సమయంలో రెండు కీలక పదవులు తెలుగు వ్యక్తుల చేతుల్లో ఉండటం ఇది మొదటిసారి. శ్రీనివాసులు శెట్టి చైర్మన్‌గా నియమితులవ్వడంతో, రామమోహన రావు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.