Page Loader
Tax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం 
10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు

Tax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు శుభవార్తను అందించేందుకు సిద్ధమైంది. మిడిల్ క్లాస్ పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనాన్ని కల్పించడానికి అవకాశం ఉందని సమాచారం. సంవత్సరానికి రూ. 10.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులకు పన్ను తగ్గింపు అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. రాయిటర్స్ నివేదికలో పేర్కొన్న అధికార వర్గాల ప్రకారం, ఈ చర్య ఫిబ్రవరి 1న సమర్పించబడ్డ బడ్జెట్ 2025లో ప్రకటించబడే అవకాశం ఉంది.

వివరాలు 

రూ. 10.5 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను 

ఈ ప్రతిపాదన వినియోగాన్ని పెంచడం, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థలో జీవన వ్యయాలపై భాధలను తగ్గించడం వంటి లక్ష్యాలను సాధించేందుకు రూపొందించబడింది. ఈ చర్య అమలు చేస్తే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలగవచ్చు. ముఖ్యంగా అధిక ఖర్చులతో పోరాడుతున్న పట్టణ మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఇది ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానంలో, రూ. 3 లక్షల నుండి రూ. 10.5 లక్షల వరకు ఆదాయంపై 5% నుండి 20% మధ్య పన్ను రేటు ఉంది. రూ. 10.5 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు విధించబడుతుంది.

వివరాలు 

 2020 పన్ను విధానాన్ని అనుసరించేందుకు ప్రోత్సాహం 

ప్రస్తుతానికి పన్ను చెల్లింపుదారులు రెండు వ్యవస్థల మధ్య ఎంచుకోవచ్చు: గృహ అద్దెలు,బీమా వంటి ఖర్చులకు మినహాయింపులను అందించే సాంప్రదాయ విధానం లేదా తక్కువ పన్ను రేట్లను అందించే కొత్త విధానం,కానీ ఎక్కువ మినహాయింపులను తొలగిస్తుంది. ప్రతిపాదిత పన్నుతగ్గింపులు మరింత మందిని సరళమైన 2020 పన్ను విధానాన్ని అనుసరించేందుకు ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం,పన్ను తగ్గింపు పరిమాణం ఇంకా ఖరారు కాలేదు కానీ,బడ్జెట్ సమయం దగ్గరగా వచ్చేసరికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై లేదా ఆదాయంపై దాని ప్రభావంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా పన్ను విధానాన్ని సరళీకరించడం,అలాగే ఆదాయ నష్టాలను భర్తీ చేయడం సాధ్యమని ఓ వర్గం సూచించింది.