Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 78,472 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు 
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 78,472 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆటో, ఫైనాన్స్ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి. ఆ తర్వాత ముఖ్యమైన షేర్లలో మదుపర్లు విక్రయాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. రోజు అంతా తీవ్ర ఒడుదొడుకుల్లో కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,557.28 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది (గత ముగింపు 78,472.87). ఇంట్రాడేలో సూచీ 78,173.38 నుండి 78,898.37 మధ్య కదలాడింది. చివరకు 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 23,854.50 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది.

వివరాలు 

 బంగారం ఔన్సు 2,642 డాలర్లు 

సెన్సెక్స్ 30 (SENSEX-30) సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడాయి. ఇక, టైటాన్‌, ఏషియన్ పెయింట్స్‌, జొమాటో, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,642 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 85.27 వద్ద ముగిసింది.