
GST collections: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదు.. ఏప్రిల్ నెలలో రూ.2.37 లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల పరంగా భారత్ మరోసారి సరికొత్త మైలురాయిని అధిగమించింది.
2025 ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ రూపంలో రూ.2.37 లక్షల కోట్లు వసూలయ్యాయని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
ఇది గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధి.
ఇప్పటివరకు నమోదైన జీఎస్టీ వసూళ్లలో ఇది అత్యధికంగా నిలిచింది.
జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 జులై 1నుంచి ఇప్పటి వరకు ఏ నెలలోనూ ఈ స్థాయి వసూళ్లు జరగలేదు.
2025 ఏప్రిల్ ఈ విభాగంలో గరిష్ఠాన్ని తాకిన నెలగా చరిత్రలో నిలిచింది.
వివరాలు
జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం పెరగడం విశేషం
గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం పెరగడం విశేషం.
అంతకుముందు నెల అయిన మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల నుంచి రూ.1.9 లక్షల కోట్లు సమకూరాయి. ఇది గతఏడాది ఇదే కాలానికి పోలిస్తే 10.7 శాతం వృద్ధిని చూపింది.
ఇక దిగుమతులపై విధించే జీఎస్టీ వలన వచ్చిన ఆదాయం కూడా 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరుకుంది.
మరోవైపు, రూ.27,341 కోట్ల విలువైన రిఫండ్‌లు జారీ చేసిన తరువాత, నికరంగా లెక్కించిన జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.