Ratan Tata: రతన్ టాటా ఆస్థి వారికేనా..! టాటా కల నెరవేర్చేది ఎవరంటే..?
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (86) ఇటీవల ముంబైలో కన్నుమూశారు. దీంతో, రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్‌కి కొత్త ఛైర్మన్‌గా ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు రతన్ టాటా ఆస్థులు ఎవరికి వెళ్ళాల్సి ఉందన్న చర్చ కొనసాగుతున్నది. ఎందుకంటే పెళ్లి చేసుకోని రతన్ టాటాకు వారసులు లేకపోవడం దీనికి కారణం. రతన్ టాటా తీసుకున్న సంకల్పం అమలు కావాల్సి ఉంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రతన్ టాటా వీలునామాను అమలు చేయడానికి న్యాయవాది డారియస్ ఖంబటా, అతని సన్నిహితుడు మెహ్లీ మిస్త్రీ, అతని సవతి సోదరీమణులు షిరీన్, డీన్నా జెజీబోయ్‌లను నియమించారు.
రతన్ టాటా నికర ఆస్థి విలువ రూ. 7,900 కోట్లు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం, టాటా సన్స్‌లో రతన్ టాటాకు 0.83 శాతం వాటాలు ఉన్నాయి. దీనిని బట్టి, రతన్ టాటా నికర ఆస్థి విలువ రూ. 7,900 కోట్లుగా ఉంది. టాటా సన్స్‌లో అయనకి ఉన్న వాటాలు రతన్ టాటా ఆస్థిలో ఎక్కువ టాటా సన్స్‌లో వాటాల రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా అనేక స్టార్టప్ కంపెనీల్లో కీలక పెట్టుబడులనుపెట్టారు. ఉదాహరణకు,పేటీఎం, ఓలా, ట్రాక్‌ఎక్స్‌ఎన్, ఫస్ట్‌క్రై, బ్లూస్టోన్, కార్‌దేఖో, క్యాష్‌కరో, అర్బన్ కంపెనీ, అప్‌స్టాక్స్ వంటి కంపెనీలలో తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఇన్వెస్ట్ చేసిన అనేక స్టార్టప్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. టాటాకు ముంబైలోని కోలాబా,అలీబాగ్‌లలో ఇళ్లు కూడా ఉన్నాయి.
లిస్టెడ్ కంపెనీలలో టాటా సన్స్ మార్కెట్ విలువ రూ. 16.71 లక్షల కోట్లు
ప్రస్తుతం, టాటా తన వీలునామాలో ఆస్తులతో పాటు పెట్టుబడులకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచబడ్డాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లకు ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ ఉన్నారు. వాస్తవానికి, మెహ్లీ రతన్ టాటాకు మంచి సన్నిహితుడు. ఈ రెండు ట్రస్టులు కలిపి సంయుక్తంగా టాటా సన్స్‌లో 52 శాతం వాటాను కలిగి ఉన్నాయి. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌ల మొత్తం వాటా 66 శాతంగా ఉండగా, లిస్టెడ్ కంపెనీలలో టాటా సన్స్ మార్కెట్ విలువ రూ. 16.71 లక్షల కోట్లుగా ఉంది. దివంగతులైన రతన్ టాటా వీలువామా సిద్ధం చేయటంలో సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబట్టా సహకరించినట్లు సమాచారం.